ఇదేందయ్యా ఇదే.. జాగ్రత్త భయ్యా అక్కడ తగిలితే అంతే.. వీడియో వైరల్‌

23 Sep, 2022 09:46 IST|Sakshi

సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు కొందరు వ్యక్తులు విభిన్న మార్గాలను ఎంచుకుంటారు. ఈ క్రమంలో కొందరు సోషల్‌ మీడియాలో క్లిక్‌ అయి మంచి ఆఫర్‌ సైతం కిట్టేసిన వారున్నారు. ఇదే క్రమంలో అడ్రస్‌ లేకుండా గల్లంతైనా వారు కూడా లేకపోలేదు. 

కాగా, తాజాగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సదరు వ్యక్తి చేసిన పని.. నెటిజన్లను తెగ నవ్విస్తోంది. వైరల్‌ అయిన వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందే.. ఓ యువకుడి తన ఇంట్లో చపాతి(రోటీ చేసేందుకు) రెడీ అయ్యాడు. చపాతీ చేసి గ్యాస్‌ పొయ్యి మీద పెట్టి కాలుస్తున్నాడు. ఇంతలో ఏదో చేద్దామని ప్రయత్నిస్తే.. మొదటికే మోసమైంది. పెనం మీద ఉన్న చపాతీని ఎగరేసే క్రమంలో కర్రకు ఉన్న పెనం ఊడిపోయి అతడి మీదే పడిపోయింది. దీంతో గాయమైనట్టు తెలుస్తో​ంది. 

దీంతో, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియో మరింత ఫన్నీగా ఉండేందుకు యోగా గురువు రామ్‌దేబ్‌ బాబా నవ్విన ఓ ఫన్నీ సీన్‌ను యాడ్‌ చేశాడు. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి. 

మరిన్ని వార్తలు