పిడుగుపాటు గురైన యువకుడు.. ఆవు పేడతో వైద్యం..

20 May, 2021 20:27 IST|Sakshi

రాయ్‌పూర్‌: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇంకా కొందరు మూఢ నమ్మకాలనే గుడ్డిగా నమ్మాతూ పాటిస్తున్నారు. ఇదే తరహా ఘటన చత్తీస్‌ఘడ్‌లో చోటు చేసుకుంది.  పిడుగుపాటుకు గురై మృతిచెందిన యువకుడుని బతుకుతాడనే నమ్మకంతో ఆవు పేడ‌తో కొన్ని గంట‌ల పాటు పాతిపెట్టారు.

చత్తీస్‌ఘడ్‌లోని పలు చోట్ల టౌటే తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిశాయి. ఓ వ్యక్తి ఇంటి బయట, ప్రాంగణంలో పేరుకుపోయిన మురుగు నీటిని తొలగించడానికి ప్రయత్నిస్తూ, అడ్డుకున్న కాలువను తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా అతను పిడుగుపాటు గురై అక్కడికక్కడే మూర్ఛపోయాడు. పెద్ద శబ్ధం రావడంతో  ఇంటి చుట్టూ పక్కన వాళ్లంతా గుమిగూడారు. వారందరూ ఆ యువకుడిని ఆవు పేడ గొయ్యిలో పాతిపెట్టమని సూచించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆ యువకుడి మొఖం తప్ప మిగతా శరీరాన్ని ఆవు పేడతో కొన్ని గంటల పాటు పూడ్చి పెట్టారు.  అయినప్పటికీ, ఆ వైద్యం ఫలించకపోవడంతో వారు 108 అంబులెన్స్ పిలిపించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స కోసం ఉదయపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. 

చదవండి: న్యూఢిల్లీ: 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి..

మరిన్ని వార్తలు