ఎంత అదృష్టమో..! విమానంలో ఒక్కడే పాసింజర్

25 Jun, 2021 19:47 IST|Sakshi

చండీగఢ్‌: మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పడు ఎంటువంటి ఇబ్బంది లేకుండా.. కూర్చోవడానికి ఓ సీటు దొరికి సౌకర్యవంతంగా ఉండాలి అనుకుంటాం. కానీ అది వీలు పడదు. ఎందుకంటే మనం ఒక్కరమే వెళ్లాలి అనుకుంటే బోలెడు ఖర్చు చేస్తే కానీ కుదరు. అయితే, ఖర్చేమీ లేకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక్కరమే వెళితే! ఆ కిక్కే వేరు. అలాంటి అవకాశం చాలా కొద్ది మందికే వస్తుంది. అటువంటింది ఓ వ్యక్తికి ఏకంగా విమానంలో ఒంటరిగా ప్రయాణించే అవకాశం దక్కింది. అవును మీరు విన్నది నిజమే. దుబాయ్ కి చెందిన ఓ భారతీయ వ్యాపార వేత్త ఎయిర్ ఇండియా విమానంలో ఒంటరిగా ప్రయాణించాడు.

సామాజిక కార్యకర్త, వ్యాపార వేత్త అయిన ఎస్.పి.సింగ్ ఒబెరాయ్ బుధవారం అమృత్ సర్ నుంచి దుబాయ్‌కి  ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లారు. ఫ్లైట్ టేకాఫ్‌ అయిన తర్వాత.. అందులో తాను ఒక్కరే ప్యాసింజర్ అని గుర్తించి ఆశ్చర్యపోయాడు. మూడు గంటల పాటు నడిచే ఈ విమానంలో ఒంటరిగా ప్రయాణించడం మహారాజులా అనిపించిందని ఒబెరాయ్ తెలిపాడు. అమృత్ సర్ నుంచి దుబాయ్‌కి జరిగిన ఈ ప్రయాణంలో చాలా అనుభూతిని పొందానని,. ఫ్లైట్ లోని ఉద్యోగులంతా తనను ఎంతో ప్రత్యేకంగా ట్రీట్ చేశారని.. ఖాళీ ఫ్లైట్ లో తన ఫొటోలు కూడా తీశారని చెప్పాడు. 

విమానంలో ఒక్కరే ప్యాసింజర్‌ ఉండడం వల్ల మొదట ఈ ఫ్లైట్ ఎక్కేందుకు ఒబెరాయ్ కి అనుమతి లభించలేదట. తరువాత  సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి చెందిన ఆఫీసర్లతో మాట్లాడించిన తర్వాత ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతిచ్చారట. ‘నా దగ్గర గోల్డెన్ వీసా కూడా ఉంది, నా దగ్గర అన్ని రకాల ట్రావెల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎట్టకేలకు ఏవియేషన్ మినిస్ట్రీ సివిల్ అనుమతి’ విమానంలోకి అనుమతించారు.
చదవండి:కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో పాస్‌పోర్ట్‌ వివరాలను సమర్పించడం ఎలా?

>
మరిన్ని వార్తలు