గప్‌చుప్‌లు మనుషులకే కాదు.. మాకు ఇష్టమే 

5 Jun, 2021 17:18 IST|Sakshi

ముంబై: గోల్‌ గప్పా.. గప్‌చుప్‌.. పానీపూరి ఇలా ఏ పేరుతో పిలిచినా దీనిని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. నోట్లో పెట్టుకోగానే నాలుకకు మంచి రుచిని అందించే గప్‌చుప్‌ను తినేందుకు జనాలు పెద్ద ఎత్తున్న ఎగబడతారు. ఇక ముంబై వీధుల్లో గప్‌చుప్‌ హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గప్‌చుప్‌లు మనుషులకే కాదు మాకు ఇష్టమే అన్న చందంగా ఒక ఆవు.. దాని లేగ దూడ లొట్టేలేసుకుంటూ ఆరంగించాయి. సాధారణంగా ఆవులు ఇంటిముందుకు వస్తే చాలామంది ఆహారాన్ని కిందపడేసి వెళ్లిపోతారు.  అలా పడేసిన ఆహారాన్ని తినేసి వెళ్లిపోతాయి.

కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తన దగ్గరకు వచ్చిన ఆవు, లేగ దూడను దగ్గర్లోని చాట్‌ బండి వద్దకు తీసుకెళ్లి గప్‌చుప్‌ తినిపించాడు. అయితే కింద పెట్టకుండా స్వయంగా తానే తన చేతులతో వాటికి తినిపించాడు. ఇంకేముంది.. అంత ప్రేమగా తినిపిస్తుంటే అవి కూడా సంతోషంగా ఆరగించాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 58వేల మంది వీక్షించారు.
చదవండి: వైరల్‌: రైతు దుశ్చర్య.. పాపం ఎలుకల దండుని..

A post shared by sree130920 (@sree130920)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు