వైరల్‌ వీడియో: బబుల్‌ బైక్‌

30 May, 2021 20:54 IST|Sakshi

కొవిడ్‌ మహమ్మారి నుంచి రక్షణ కోసం క్రికెటర్లకు బయో బబుల్‌ నిబంధనలు అమలు చేస్తున్నాయి క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డులు. అదే తరహాలో కరోనా నుంచి రక్షణ కోసం తన బైక్‌ చుట్టూ ఓ బబుల్‌ రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నాడో యువకుడు. అంతేకాదు తన బైక్ వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి తనకి తగలకుండా గ్యాప్‌ వచ్చేలా సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్స్‌ కూడా చేశాడు. 

సెఫ్టీ 
కేవలం కర్రలు, ప్లాస్టిక్‌షీట్‌తో ఆ యువకుడు కరోనా షీల్డ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ఎంచక్కా సిటీలో చక్కర్లు కూడా కొట్టాడు. ఇతని పద్దతి చూసి ముచ్చటపడిన కొందరు వీడియో తీసి సోష్‌ల్‌మీడియాలో షేర్‌ చేశారు. అక్కడా పాపులర్‌ అయిపోయిందీ బబుల్‌ బైక్‌. రూపిన్‌ శర్మ అనే ఐపీఎస్‌ అధికారి కొవిడ్‌ సేఫ్టీ మెజర్స్‌ అంటూ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు