గణేష్ మండపంలో బుర్ఖాతో డ్యాన్సులు.. అరెస్టు

24 Sep, 2023 14:22 IST|Sakshi

చెన్నై: గణేష్ చతుర్థి ఉత్సవాల్లో ఓ యువకుడు బుర్ఖా ధరించి డ్యాన్సులు వేయడం వివాదాస్పదంగా మారింది. బుర్ఖా ధరించి డ్యాన్సులు వేయడాన్ని ఆక్షేపిస్తూ ఫిర్యాదులు రావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తమిళనాడులోని వెల్లూరులో ఈ ఘటన జరిగింది.

గణేష్ చతుర్థి ఉత్సవాల్లో ఓ యువకుడు డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియోలో వైరల్‌ అయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. బుర్ఖా ధరించి డ్యాన్సులు వేయడాన్ని తప్పుబడుతూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువకున్ని అరుణ్‌ కుమార్‌గా గుర్తించి అరెస్టు చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా ఉందని పోలీసులు తెలిపారు. వినాయక ఉత్సవాల్లో మతపరమైన భావాలను దెబ్బతీస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. డ్యాన్స్‌లో పాల్గొన్న ఇతర యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన


 

మరిన్ని వార్తలు