స్కామ్‌ v/s స్కామ్‌: బీజేపీపై రూ. 6 వేల కోట్ల అభియోగం

5 Oct, 2022 20:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ ఆప్‌ల మధ్య స్కామ్‌ వర్సస్‌ స్కామ్‌ పోరు హోరాహోరిగా సాగుతుంది. ఈమేరకు ఢిల్లీలోని లెప్టెనెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ పథకంలో పెద్ద ఎత్తున​ కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆప్‌ బీజేపీ హయాంలో జరిగిన కుంభకోణాలను వెలకితీసే ఎత్తుగడకు పూనుకుంది.

అందులో భాగంలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ సంస్థలు టోల్‌టాక్స్‌ వసూళ్లలో రూ. 6 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయని, దీనిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉపముఖ్యముంత్రి మనీష్‌ సిసోడియాకు లేఖ రాశారు. ఈ మేరకు ఆయన లేఖలో... "బీజేపీ ఆధ్వర్యంలోని ఎంసీడీలో జరిగిన సుమారు రూ. 6 వేల కోట్ల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ రెండునెలల క్రితమే లేఖ రాశానని గుర్తు చేశారు. అంతేగాదు ప్రతిరోజూ ఢిల్లీలోకి ప్రవేశించే దాదాపు 10 లక్షల వాణిజ్య వాహనాల నుంచి టోల్ టాక్స్ వసూలు చేసే రెండు కంపెనీలతో ఎంసీడీ కుమ్మక్కయ్యిందని, అయితే ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకు చేరదని ఆరోపించారు.

ఐతే మీరు ఆ స్కామ్‌పై దృష్టి పెట్టలేకపోయారు. ఎందుకంటే అది బీజేపీ హయాంలో జరిగింది కాబట్టి వదిలేశారు. దాని బదులుగా నా ఇంటిపై సీబీఐ దాడులు జరిపించారు. లిక్కర్‌ స్కామ్‌లో బీజేపీ రూ. 10 వేల కోట్లు  స్కామ్‌ జరిగిందంటే, మీరు రూ. 144 కోట్లు అన్నారు. ఆఖరికి సీబీఐ కోటీ రూపాయల స్కామ్‌ అంది. చివరికి మీరు జరిపించిన సీబీఐ దాడుల్లో ఏమి దొరకలేదు. కేవలం మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వంపై ప్రతిరోజు కొత్త ఆరోపణలతో సీబీఐ దాడుల జరిపించే పనిలో బిజీగా ఉన్నారు.

అయినా మీరు ముందు ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు  చేసే బదులు మీరు నిర్వహించే శాఖలపై దృష్టి సారించండి. పెరిగిపోతున్న నేరాలను కట్టడి చేయండని, ఆక్రమణకు గురవుతున్న భూములను విముక్తి చేయమని కోరుతూ  వస్తున్న లేఖలపై దృష్టి సారించండి" అని ఘటూగా విమర్శిసిస్తూ లేఖ రాశారు. అయినా 17 ఏళ్లుగా ఎంసీడీని పాలుస్తన్న బీజేపీ నగరాన్ని చెత్తకుప్పగా చేసిందని దుయ్యబట్టారు.  

(చదవండి: చిరుత పిల్లకు పాలు పట్టించేందుకు యోగి పాట్లు)
 

మరిన్ని వార్తలు