‘అప్పుడే పాక్‌కి గట్టిగా సమాధానం చెప్పుండాల్సింది’

23 Nov, 2021 18:08 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ సీనియ‌ర్ నేత మ‌నీష్ తివారి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటమితో పాటు కాంగ్రెస్‌ పలు చోట్ల గెలుపొంది తిరిగి పుంజుకుంటోందన్న సమయంలో తివారీ ట్వీట్‌ దుమారేన్ని రేపాయి. ఆయన రాసిన కొత్త పుస్తకం ‘10 ఫ్లాష్ పాయింట్స్‌, 20 ఇయ‌ర్స్‌.. నేష‌న‌ల్ సెక్యూర్టీ సిచ్యువేష‌న్స్ ద‌ట్ ఇంపాక్టెడ్ ఇండియా’ త్వర‌లో మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ పుస్తకాన్ని రూపా బుక్స్  ప్రచురిస్తోంది. 

ఆ పుస్తకంలో..  ముంబై ఉగ్రదాడులు గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. 2008, సెప్టెంబ‌ర్ 26న ముంబైలో ఉగ్రవాదులు దాడి చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ దాడులు జరిగిన వెంటనే పాక్‌ చర్యలకు భారత ధీటుగా బదులిచ్చుంటే బాగుండేదని తివారి అభిప్రాయ‌ప‌డ్డారు. కిరాతకంగా ఉగ్రవాదులు అమాయక ప్రజలను  హ‌త‌మార్చారు. అలాంటి పరిస్థితుల్లో మన్మోహన్‌ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని, ఆ సమయంలో కేవలం మాట‌లకే పరిమితం అయ్యిందని, తివారి త‌న పుస్తకంలో తెలిపారు.  గ‌త రెండు దశాబ్దాల్లో భారత్‌ ఎదుర్కొన్న జాతీయ భ‌ద్రతా అంశాల‌ను కూడా త‌న పుస్తకంలో వెల్లడించారు మనీష్‌ తివారి.

చదవండి: Viral Video:ట్రైన్‌లో సీట్‌ దొరకలేదు.. ‘ఓరి నీ తెలివి తగలెయ్య’

మరిన్ని వార్తలు