పాక్‌తో వాణిజ్య చర్చలు వృథా.. సిద్ధూ వ్యాఖ్యలపై విమర్శలు

5 Dec, 2021 17:16 IST|Sakshi

లుధియానా: పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఆ పార్టీ ఎంపీ మనీష్ తివారీ విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు పెంచుకోవటం వల్ల ఇరు దేశాల స్నేహబంధం పెరుగుతుందన్న సిద్ధూ వ్యాఖ్యలను ఖండించారు. భారత్‌పై.. పొరుగు దేశం పెంచుకుంటున్న వ్యతిరేకత ఆగేవరకు పాక్‌తో వాణిజ్య చర్చలు జరపడం వ్యర్థమని స్పష్టం చేశారు.

చదవండి: మొదటి వారం రాజ్యసభ సమావేశాలు.. 52 శాతం సమయం వృథా

పాకిస్తాన్‌ ఇండియాలోకి ఉగ్రవాదులను పంపుతోందని మండిపడ్డారు. మారణాయుధాలు, డ్రగ్స్‌ను పాక్‌ తమ డ్రోన్ల ద్వారా భారత భూభాగంలో చేరవేస్తోందని అన్నారు. ఇలాంటి చర్యలు ఆగేవరకు పాక్‌తో వాణిజ్య చర్చలు జరపడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. కరాచీ సరిహద్దు తెరిచి ఉంటే.. వ్యాపారం కోసం అట్టారీ సరిహద్దును ఎందుకు తెరవలేరని సిద్ధూ ప్రశ్నించిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు