కర్ణాటక: తేనె రైతుకు ప్రధాని మోదీ ప్రశంసలు 

1 Aug, 2022 09:56 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్‌ కీ బాత్‌లో కర్ణాటకలో నిర్వహించిన అమృత భారతికి కన్నడ హారతి కార్యక్రమాన్ని అభినందించారు. అలాగే తేనె ఉత్పత్తిలో కరావళి, మలెనాడు, ఉత్తర కన్నడ ప్రాంతాల్లో రైతులు చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు. ఉత్తర కన్నడ జిల్లాలోని శిరసి తాలూకాలోని తేనె రైతు మధుకేశ్వర హెగ్డేను ఆయన ప్రస్తావించారు. హెగ్డే కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొంది 50 పెట్టెల తేనెటీగల పెంపకం ప్రారంభించారు. నేడు 800కు పైగా పెట్టెల్లో తేనెపట్లను పెంచుతున్నారు. మధు అంటే తేనె, ఆ పనిలో సాధన చేసి పేరును సార్థకం చేసుకొన్నారని మోదీ ప్రశంసించారు. 

మరిన్ని వార్తలు