మావోయిస్టుల దుశ్చ‌ర్య‌.. ఇన్‌ఫార్మ‌ర్ నెపంతో యువ‌కుడి హత్య

12 Nov, 2021 14:53 IST|Sakshi

రాయపూర్: దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. వివరాల ప్రకారం.. ఉమేష్ మర్కం గత కొంత కాలంగా 'గోప్నియా సైనిక్' (రహస్య పోలీసు ఇన్‌ఫార్మర్)గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను తన స్వగ్రామమైన కాటేకల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేటం గ్రామం నుంచి దంతెవాడ పట్టణానికి వెళ్తుండగా మావోయిస్టులు కొందరు మార్కంపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు.

దీంతో మార్కం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.రాజధాని రాయ్‌పూర్‌కు 400 కి.మీ దూరంలో ఉన్న తేటమ్ గ్రామంలో గత ఏడాది పోలీసు శిబిరాన్ని ఏర్పాటు చేయడంలో అధికారులకు మద్దతు ఇవ్వడంలో మార్కం కీలకపాత్ర పోషించారు.

గత సంవత్సరం డిసెంబర్‌లో నుంచి అతను 'గోప్నియా సైనిక్'గా పని చేయడం ప్రారంభించాడు. ఈ రహస్య ఇన్‌ఫార్మర్‌లను నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల కోసం, ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లను సేకరించడం కోసం స్థానిక స్థాయిలో జిల్లా పోలీసులు నియమిస్తారు. నిందితుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: శ్రీకి లీలలు!!.. జన్‌ ధన్‌ అకౌంట్ల నుంచి 6వేల కోట్ల సొమ్ము మాయమైందన్న కుమారస్వామి

మరిన్ని వార్తలు