ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌: రాకేశ్వర్‌ క్షేమం, ఫొటో విడుదల

7 Apr, 2021 12:37 IST|Sakshi

ఫొటో విడుదల చేసిన మావోయిస్టులు

విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ 

చత్తీస్‌గఢ్‌: మావోయిస్టులు బందీగా తీసుకెళ్లిన సీఆరీ్పఎఫ్‌ కోబ్రా జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ క్షేమంగానే ఉన్నారు. ఈ మేరకు ఆయన క్షేమ సమాచారాన్ని తెలియజేస్తూ మావోయిస్టులు రాకేశ్వర్‌ ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఫొటోలో ఆయన సాధారణంగానే ఉన్నారు. ఎలాంటి భయం, దిగులు లేకుండా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలోని తెర్రెం పోలీస్‌స్టేషన్‌ పరిధి జొన్నగూడెం అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందగా.. ఒక జవాన్‌ను మావోయిస్టులు బందీగా తీసుకెళ్లిన విషయం విదితమే. అనంతరం ఆయన తమవద్ద క్షేమంగా ఉన్నారని.. ఎలాంటి హానీ తలపెట్టబోమని మావోయిస్టులు ప్రకటించారు. ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు చెబితే జవాన్‌ను అప్పగిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ మంగళవారం లేఖ విడుదల చేశారు. అయితే, ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో జవాన్‌ విడుదలపై ఉత్కంఠ నెలకొంది.  

ఆ బాధ్యత మీదే: రాకేశ్వర్‌ భార్య మీనూ 
జవాన్‌ ఒక్కరోజు ఆలస్యంగా డ్యూటీకి వెళితే యాక్షన్‌ తీసుకునే ఆర్మీ.. అదే జవాను విధుల్లో అదృశ్యమైతే ఏం యాక్షన్‌ తీసుకుంటోందని రాకేశ్వర్‌సింగ్‌ భార్య మీనూ కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాకేశ్వర్‌సింగ్‌ విడుదలకు  చర్యలు చేపట్టాలని కోరారు. రాకేశ్వర్‌ ఓ తల్లికి కొడుకు,  తన భర్త అనే విషయాలు పక్కనబెట్టాలని.. మీ జవాన్‌ను సురక్షితంగా తీసుకురావాల్సిన బాధ్యత మీదే అని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియో  వైరల్‌గా మారింది. కాగా,  పాక్‌కు బందీగా చిక్కిన పైలెట్‌ అభినందన్‌ను విడిపించినట్టే.. రాకేశ్వర్‌ను విడుదల చేయించాలని అతని సోదరుడు విజ్ఞప్తి చేశారు. 

రాకేశ్వర్‌ని విడుదల చేయాలి: ప్రొ.హరగోపాల్‌ 
మావోయిస్టుల ఆధీనంలో ఉన్న రాకేశ్వర్‌సింగ్‌ను వెంటనే విడుదల చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక విజ్ఞప్తి చేసింది. ఆయన్ను విడుదల చేస్తామన్న మావోయిస్టులు తమ మాట నిలబెట్టుకోవాలని కోరింది. ఈ విష యంలో ప్రభుత్వాలు  ముందడుగు వేయాలని వేదిక తరఫున ప్రొ.జి.హరగోపాల్, కనీ్వనర్, కోకనీ్వనర్లు ప్రొ.జి.లక్ష్మణ్, ఎం.రాఘవాచారి, కె.రవిచందర్‌ ఓ ప్రకటనలో కోరారు. 

చదవండి: మావోయిస్టుల కీలక ప్రకటన: రాకేశ్వర్‌ను విడిచిపెడతాం

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు