ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మరాఠీల ధన్యవాదాలు 

25 Apr, 2021 00:59 IST|Sakshi

వెంటీలేటర్లు అందించినందుకు సోషల్‌ మీడియాలో ప్రశంసలు 

సాక్షి ముంబై: మహారాష్ట్రకు వెంటిలేటర్లను అందించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ పలు సందేశాలు ముఖ్యంగా మరాఠీ సందేశాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి అత్యంత తీవ్రంగా ఉంది. కరోనా బాధితులకు ఆక్సిజన్‌తోపాటు వెంటిలేటర్లు కూడా లభించడంలేదు. దీంతో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సాయం కోరారు.

కాగా, వెంటనే 300 వెంటిలేటర్లు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై నితిన్‌ గడ్కరీ ఏపీ ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త తెలిసిన అనంతరం సోషల్‌ మీడియాలో కూడా అనేక మంది ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే పోస్టులు పెట్టారు. ముఖ్యంగా ఇలాంటి గడ్డు పరిస్థితిలో సాయం చేసి మానవత్వాన్ని చాటిన జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలంటూ అనేక రకాల పోస్టులు సోషల్‌ మీడియాలో కన్పించాయి.   

చదవండి: (సీఎం వైఎస్‌ జగన్‌కు గడ్కరీ కృతజ్ఞతలు)

మరిన్ని వార్తలు