పాలు ప్రాణాలు తీస్తాయనుకుంటామా?.. కానీ అదే జరిగింది

19 Sep, 2022 19:22 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

గురుగ్రాం: పాలు విషయమై దంపతుల మధ్య మొదలైన చిన్నపాటి వివాదం ముదిరి ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. జార్ఖండ్‌కు చెందిన జుహి(22), బెంగాల్‌లోని రాంపురాకు చెందిన సుశాంత ఘోష్‌(25) దంపతులు చుమా గ్రామంలోని అద్దెంట్లో నివాసం ఉంటున్నారు.

శనివారం రాత్రి జుహి తనకు పాలు, చపాతి తినాలనుందని చెప్పడంతో ఘోష్‌ బయటి నుంచి వాటిని తీసుకువచ్చాడు. అనంతరం పాల విషయంలో ఇద్దరి మధ్య మొదలైన చిన్న గొడవ పెద్దదిగా మారింది. మనస్తాపంతో ఘోష్‌ ఏదో విష పదార్థం తీసుకున్నాడు. ఆస్పత్రిలో చేర్పించిన రెండు గంటల తర్వాత కన్నుమూశాడు. విషయం తెలిసి జుహి కూడా విషం తాగి, ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పారు. 

చదవండి: (CM Basavaraj Bommai: తెలంగాణ సర్కార్‌పై కర్ణాటక సీఎం ఆగ్రహం) 

మరిన్ని వార్తలు