‘ఇలా అయితే కరోనా గొలుసు తెంచలేం’

2 Oct, 2020 17:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మాస్క్‌ను ధరించకుండా, సామాజిక దూరం  పాటించకుండా  ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు అనుసరించకుండా ఉంటే కరోనా మహమ్మారి గొలుసును తెంచడం చాలా కష్టమని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్థన్‌ అన్నారు. హెల్త్‌ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయిన ఆయన... ఇప్పటికీ చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదని, సామాజిక దూరం పాటించలేదని అన్నారు. అలా అయితే ‍కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం సాధ్యం కాదని అన్నారు.

దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైన తరువాత దాదాపు అన్ని సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు పునఃప్రారంభం అయ్యాయని, ఇలాంటి సమయంలో కరోనా మార్గదర్శకాలు పాటించడం చాలా అవసరమని ఆయన  పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హెల్త్‌ వర్క్‌ల కృషిని అభినందించారు. వారి సేవ ఎన్నటికి మరవలేనిదని అన్నారు. అవార్డులు గెలుచుకున్న వారికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  చదవండి: గుడ్‌న్యూస్‌ : జనవరి నాటికి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు