కశ్మీర్‌లో హిమపాతం

2 Feb, 2023 04:52 IST|Sakshi
ఘటన చోటుచేసుకున్న చోటు ఇదే

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం గుల్మార్గ్‌లో బుధవారం మంచు చరియల కింద చిక్కుకుని ఇద్దరు విదేశీ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మంచు కింద చిక్కుకుపోయిన మరో 21 మందిని పోలీసులు కాపాడారు.

21 మంది పోలండ్, రష్యా దేశస్తులు, ఇద్దరు స్థానిక గైడ్లు మూడు బృందాలుగా ఏర్పడి ప్రఖ్యాత స్కై రిసార్ట్‌ హపట్‌ఖుడ్‌ కాంగ్‌డోరి వద్ద ఉండగా భారీ 20 అడుగుల పొడవైన మంచు పెళ్ల వారికిపైకి దొర్లుకుంటూ వచ్చి పడింది. ఈ ఘటనలో మంచు కింద చిక్కుబడిన ఇద్దరు పోలండ్‌ జాతీయులు చనిపోగా, మిగతా వారినందరినీ కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో నిషేధ హెచ్చరికలు ఏర్పాటు చేశామన్నారు.
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు