Nepal Massive Avalanche: బాప్‌రే!.. ఎంత పెద్ద భయానక దృశ్యం!

17 Nov, 2021 08:47 IST|Sakshi

న్యూఢిల్లీ: కొన్ని ప్రకృతి వైపరిత్యాలు అత్యంత భయానకంగా ఉంటాయి. పైగా వాటిని మళ్లీ చూడాలనే సాహాసం కూడా చేయలేనంత భయం వేస్తుంది. అచ్చం అలాంటి భయానక ప్రకృతి వైపరిత్యం నేపాల్‌లో సంభవించింది.

(చదవండి: ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..)

అసలు విషయంలోకెళ్లితే... నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లాలో మంచుతో కప్పబడిన పర్వతాలు చూపురులను ఆకర్షించేలా ఎంతో ప్రశాంతంగ కనిపిస్తుంది. అంతే ఇంతలో ఒక్కసారిగా అతి పెద్ద హిమపాతం సంభవిస్తుంది. దీంతో అక్కడున్నవారందరూ భయంతో అరుస్తూ పరుగులు పెడుతుంటారు. అంతే అప్పటివరకు ఎంతో అందంగా కనిపించిన ప్రాంతం కాస్త ఒక్కసారిగా  భయంకరంగా మారిపోతుంది.

ఒక వైపు నుంచి వేగవంతంగా మంచు అక్కడున్న ప్రజలను తరుముతున్నట్లుగా తెల్లటి బిళ్ల వలే చుట్టుముట్టేస్తుంటుంది. అయితే ఈ ఘటనలో  ఏడుగురు విద్యార్థులతో సహా 11 మంది గాయపడ్డారని, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ముస్తాంగ్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేత్ర ప్రసాద్ శర్మ వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు ఎంత  భయానక దృశ్యం అంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: మదురై జైలులో రూ.100 కోట్లు హాంఫట్‌)

A post shared by Everest Base camp 2022 (@mountain.trekking)

మరిన్ని వార్తలు