Massive Fire Breaks: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలు చెలరేగడంతో 19 అంతస్తు నుంచి దూకేశాడు

22 Oct, 2021 20:43 IST|Sakshi

ముంబై: ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరేల్‌ ప్రాంతంలోని 60 అంతస్థుల నివాస భవనంలో శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. కర్రీ రోడ్డులోని అవిజ్ఞ పార్క్ భవనంలో మంటలు చెలరేగాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  ఒక్కసారిగా మంట‌లు చెలరేగడంతో పాటు మ‌రో వైపు భవనం మొత్తం ద‌ట్టమైన పొగ‌లు కమ్మేయడంతో వాటి నుంచి త‌ప్పించుకునేందుకు ఓ వ్యక్తి​ ప్రయత్నించి అతని ప్రాణలనే పోగొట్టుకున్నాడు. (చదవండి: ఫలించిన సీఎం కేసీఆర్‌ వ్యూహం)

అవిఘ్న పార్క్‌ సొసైటీలోని 19వ ఫ్లోర్‌లో మంట‌లు చెల‌రేగ‌డంతో అందులో ఉన్న ఓ 30 ఏండ్ల యువ‌కుడు అరుణ్ తివారీ త‌న ప్రాణాల‌ను కాపాడుకునేందుకు య‌త్నించాడు. ఈ క్రమంలో బాల్కనీలోకి వచ్చాడు.గ్రిల్స్‌ పట్టుకుని కిందకు దిగేందుకు ట్రై చేశాడు. పట్టు జారడంతో ఒక్కసారిగా అంతపై నుంచి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు ప్రమాదం విషయం తెలిసిన వెంటనే 12 ఫైర్‌ ఇంజన్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకవచ్చేందుకు  తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని బీఎంసీ క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు.

చదవండి: నటి పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి... కొంచెమైతే ఏమయ్యేదో.. 

మరిన్ని వార్తలు