Delhi Fire Accident: అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన గుడిసెలు.. ఏడుగురి సజీవ దహనం

12 Mar, 2022 10:39 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలో మురికివాడల్లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో  ఏడుగురు సజీవదహనమవ్వగా... భారీ ఆస్తినష్టం వాటిల్లింది . ఈ ఘటన శనివారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో జరిగినట్లు అధికారులు తెలిపారు.  

ఈ ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని కొన్ని గంటల వ్యవధిలో మంటలను అదుపులోకి వచ్చాయని చెప్పారు. సుమారు 60కి పైగా గుడిసెలు కాలి బూడిద అయ్యాయి. మంటలు చాలా వేగంగా వ్యాపించడంతో మృతులు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఢిల్లీ ఫైర్ డైరెక్టర్ అతుల్ గార్గ్ అన్నారు.

ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంలో మృతి చెందిన బాధితులకి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సంతాపం తెలిపారు. ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ కూడా బాధితులకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్‌పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపి, కుటుంబ సభ్యులకు తక్షణమే రూ. కోటి రూపాయల సాయం ప్రకటించాలని ఆయన అన్నారు. మనోజ్ తివారీ ఈరోజు గోకుల్‌పురి ప్రాంతాన్ని సందర్శించనున్నారు.

(చదవండి: పాకిస్తాన్‌ పై భారత్‌ క్షిపణి ప్రయోగం... ప్రమాదవశాత్తు జరిగిందని వివరణ)

>
మరిన్ని వార్తలు