ఘోర అగ్ని ప్రమాదం...దుకాణాలు ఆహుతి

5 Nov, 2022 19:35 IST|Sakshi

ఒక స్ట్రీట్‌ మార్కెట్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో దుకాణాలన్ని ఆహుతయ్యాయి. ఈ ఘటన ముంబైలోని ఫ్యాషన్‌ స్ట్రీట్‌లో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొన్ని వస్త్ర దుకాణాలు, హ్యాండ్‌ బ్యాగ్‌ దుకాణాలు ఆహుతైనట్లు అధికారులు తెలిపారు.

చాలా తక్కువ ఖరీదుకి వస్తువులు లభించే ముంబైలోని ప్రసిద్ధ మార్కెట్‌ అని చెబుతున్నారు. ఐతే ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనేది తెలియలేదు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మాధ్యమంలో తెగ వైరల్‌ అవుతోంది. 

మరిన్ని వార్తలు