నెగిటివ్‌ రిపోర్టు వద్దనేసరికి రోడ్లన్నీ జామ్‌!

14 Jun, 2021 08:34 IST|Sakshi

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవేశించేవారు కొవిడ్‌-19 ఆర్టీపీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్టును చూపించాల్సిన అవసరంలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో గంటల వ్యవధిలోనే ఆ రాష్ట్ర సరిహద్దులో రహదారులు కార్లతో నిండిపోయాయి. వేలాది వాహనాలు కిలోమీటర్ల మేరకు బారులు తీరాయి. గత 36 గంటల్లో షోగి రహదారి ద్వారా సుమారు 5,000 వాహనాలు రాజధాని సిమ్లాలోకి ప్రవేశించాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

మరోవైపు కొవిడ్ నిబంధనలను పాటించాల్సిందిగా పర్యాటకులకు హిమాచల్‌ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో 5,402 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. కాగా మాస్కు ధరిస్తూ, సామాజిక దూరం పాటించాలని ఆ రాష్ట్ర పోలీసులు సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ఆంక్షలను సడలించి పర్యాటకులను అనుమతిస్తున్నట్టు శుక్రవారం తెలిపింది. ఇక జూన్ 14 నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంటాయని వెల్లడించింది. అలాగే  ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
 

చదవండి: 38 భార్యల ముద్దుల భర్త ఇక లేరు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు