Match Box: 14 ఏళ్ల తరువాత ధర డబుల్‌ ..

24 Oct, 2021 08:06 IST|Sakshi

సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): ముడిపదార్థాల ధరలు పెరగడంతో ఉత్పత్తిదారులు అగ్గిపెట్టె ధర పెంచనున్నారు. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి అగ్గిపెట్టె రూ.2కు విక్రయించనున్నట్లు ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. తూత్తుకుడి జిల్లా, కోవిల్‌పట్టి తెన్‌కాశి జిల్లా శంకరం కోయిల్, విరుదునగర్‌ జిల్లా శివకాశి, గుడియాత్తంలో సుమారు రెండువేలకు పైగా అగ్గిపెట్టె కర్మాగారాలున్నాయి. వీటిలో ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ సుమారు 5 లక్షల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు.

ఇటీవల కాలంలో క్లోరైడ్, అట్ట, మైనం, పేపర్‌ తదితర వస్తువుల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అగ్గిపెట్టె ధరలను పెంచాలని ఉత్పత్తిదారుల సంఘం కోరింది. దీంతో శుక్రవారం సమాలోచన కూటమి నిర్వహించారు. ఇప్పటి వరకు రూ.1కి విక్రయిస్తున్న అగ్గిపెట్టెను రూ.2కి విక్రయింయాలని నిర్ణయించారు. ఉత్పత్తిదారుల సంఘం వారు మాట్లాడుతూ గత 1995లో 50 పైసలకు విక్రయించిన అగ్గిపెట్టెను 2008లో రూపాయికి పెంచామన్నారు. 14 సంవత్సరాల తరువాత అగ్గిపెట్టె ధరను ప్రస్తుతం రూ.2కి పెంచుతున్నట్లు వెల్లడించారు.   

మరిన్ని వార్తలు