కృష్ణ జన్మస్థలి కేసులో కొత్తమలుపు

12 Sep, 2021 06:26 IST|Sakshi

మథుర: శ్రీకృష్ణ జన్మస్థలిగా భావించే స్థలంలో లభించిన కొన్ని వస్తువులకు సంబంధించిన వీడియో ఆధారాలను కృష్ణ జన్మస్థలి పిటీషనర్లు కోర్టు ముందుంచారు. ఈ వస్తువులు హిందూ మతవిశ్వాసాలకు సంబంధించినవని, వీటిని తర్వాత నిర్మించిన మసీదునుంచి తొలగించడం లేదా కనిపించకుండా చేయడం జరిగిఉంటుందని వివరించారు. ప్రస్తుతం మథురలోని షాహీ మసీదు స్థలంలో కృష్ణ జన్మస్థలి ఉందని చాలా సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది.

ఇప్పుడున్న కట్రా కేశవ్‌ దేవ్‌ గుడి ఆవరణలోని షాహీ ఇద్గా మసీదును తొలగించాలని పిటీషనర్లు కోర్టును ఆశ్రయించారు. తమ వాదనకు ఆధారంగా తాజాగా ఒక వీడియోను కోర్టుకు సమర్పించారు. ఇందులో మసీదులో శేష నాగు చిహ్నం, తామర పువ్వు, శంఖం చూపుతున్నాయి. ఇవన్నీ తర్వాత కాలంలో మసీదు నుంచి తొలగించి ఉంటారని, లేదా కనిపించకుండా రంగులు వేసి ఉంటారని పిటీషనర్లు ఆరోపించారు. తదుపరి విచారణ ఈ నెల 15న ఉందని పిటీషనర్ల తరఫు న్యాయవాది మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌ చెప్పారు. ఆ రోజు భారత పురాతత్వ సంస్థతో భౌతిక సర్వే కోసం పట్టుపడతామని చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు