పెళ్లి అనుకుంటే లొల్లి 

12 Sep, 2022 09:38 IST|Sakshi

బనశంకరి: పెళ్లి సంబంధాల వెబ్‌సైట్లో పరిచయమైన యువతి మాయలో పడిన ఓ యువకుడు సుమారు రూ. 10 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు దక్షిణ పరిధిలో చోటుచేసుకుంది. హనుమగిరి నివాసి అజయ్‌కుమార్‌ బాధితుడు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అజయ్‌కుమార్‌ గత నెల 29వ తేదీన వెబ్‌సైట్లో వధువు కావాలని తన ఫొటో వివరాలను అప్‌లోడ్‌ చేశాడు. తరువాత ఉత్తర భారతదేశానికి చెందిన యువతి అతనికి మెసేజ్‌ పంపించగా ఇద్దరూ ఫోన్‌ నంబర్లను మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. 

భారీగా వసూళ్లు  
మీరంటే ఇష్టమని, మిమ్మల్ని చూడడానికి వస్తానని యువతి చెప్పింది. దీంతో యువకుడు  ఆమె బ్యాంకు అకౌంట్‌కు కొంత డబ్బు జమచేశాడు. అప్పటినుంచి యువతి పలు కారణాలు చెబుతూ అతన్నుంచి నగదు పిండుకోసాగింది. మొత్తం రూ.9.95 లక్షలు ఆమె ఖాతాలోకి జమచేశాడు. తరువాత యువతి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకుని అడ్రస్‌ లేకుండా పోయింది. మోసపోయానని గుర్తించిన యువకుడు బెంగళూరు దక్షిణ సీఈఎన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

(చదవండి: ఐటీసీటీలో అతిపెద్ద సమస్య... అక్రమ సంబంధాలతో 981 జంటలు)

మరిన్ని వార్తలు