కోవిడ్‌ బారిన మేఘాలయ సీఎం

11 Dec, 2020 18:06 IST|Sakshi

సాక్షి, షిల్లాంగ్‌: మరో ముఖ్యమంత్రి కరోనా మహమ్మారి బారిన పడ్డారు. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆయనకు స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ నివేదికలో పాజిటివ్‌ రావడంతో ఈ విషయాన్ని సీఎం సంగ్మా ట్విటర్‌లో తెలిపారు. తనకు తేలికపాటి కరోనా వైరస్‌ లక్షణాలున్నాయని, హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. గత అయిదు రోజులుగా తనతో కలిసినవారు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కాంగా సంగ్మా కేబినెట్‌లోని ఆరోగ్యశాఖ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రులు కూడా ఈ ఏడాది అక్టోబర్‌లో కరోనా బారిన పడ్డారు. 

మరిన్ని వార్తలు