మేఘాలయ, నాగాలాండ్‌ ముఖ్యమంత్రులు ప్రమాణం

7 Mar, 2023 15:20 IST|Sakshi

నాగాలాండ్‌, మేఘాలయా ముఖ్యమంత్రులుగా ఎన్‌డీపీపీ చెందిన నీఫియా రియో, నేఫనల్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన కాన్రాడ్‌ సంగ్మా మంగళవారం ప్రమాణం చేశారు. మొదటగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కాన్రాడ్ కె సంగ్మా మేఘాలయ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా తోపాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు.

మంగళవారం సంగ్మా తోపాటు ఎన్‌పీపీకి చెందిన ప్రిస్టోన్ టిన్‌సాంగ్, స్నియావ్‌భలాంగ్ ధర్‌లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బీజేపీకి చెందిన అలెగ్జాండర్ లాలూ హెక్, యుడీపీకి చెందిన పాల్ లింగ్డో, కిర్మెన్ షిల్లా, హెచ్‌ఎస్‌పీడీపీకి చెందిన షక్లియార్ వార్జ్రీ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఈ మేరకు నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలలో యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ, హెచ్‌ఎస్‌పీడీపీకి నుంచి ఒక్కొక్కరు సంగ్మా మంత్రివర్గంలో సభ్యులుగా గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణం చేయించారు.

ఇదేరోజు  నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి)కి చెందిన నీఫియు రియో కూడా ప్రమాణ చేశారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నీఫియు ఐదోసారి ప్రమాణం చేశారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా టిఆర్ జెలియాంగ్,  వై పాటన్ ప్రమాణ స్వీకారం చేయగా, రియో క్యాబినెట్‌లోని ఇతర సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే సోషల్‌ మీడియాలో కామెడీ చేస్తూ ఫేమస్‌ అయినా రాష్ట్ర బీజేపీ చీఫ్ టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్, నానాగాలాండ్ అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికైన ఇద్దరు మహిళల్లో ఒకరైన సల్హౌతుయోనువో క్రూసే మంత్రి మండలి సభ్యులుగా ప్రమాణం చేశారు.

హోలీ తర్వాత రోజు గురువారం త్రిపురలో బీజేపీకి చెందిన మాణిక్‌ సాహా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్డీపీపీ, బీజేపీ రెండూ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా 72 ఏళ్ల రియోను ఎన్నుకున్నాయి. అలాగే రాష్ట్రంలోని అన్ని ఇతర పార్టీలు రియో నేతృత్వంలోని కూటమికి తమ మద్దతను ఇచ్చాయి.

మేఘాలయాలో ఎన్‌పీపీ నేతృత్వంలోని కూటమి బీజేపీకి చెందిన ఇద్దరితో సహా మొత్తం 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం కాన్రాడ్‌ సంగ్మా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. సంగ్మా ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకున్నారు. ఆయన మంగళవారం ఇతర క్యాబినేట్‌ మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, సోమవారం కొత్తగా ఎన్నికైన 58 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయగా, ప్రొటెం స్పీకర్‌ తిమోతి షిరా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ వేడుకగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగ్మా కూడా హాజరయ్యారు. కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీకి స్పీకర్‌ను మార్చి9న ప్రత్యేక హౌస్‌లో సెషన్‌లో ఎన్నుకోనున్నట్టు సమాచారం. త్రిపురలో బీజేపీ నాయకుడు మాణిక్‌ సాహా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారని ఆ పార్టీ ప్రకటించింది. సోమవారం అగర్తలాలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో సాహాను ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాజీబ్ భట్టాచారీ తెలిపారు. అంతేగాదు బీజేపీ దాని మిత్ర పక్షాలు త్రిపుర, నాగాలాండ్‌లో అధికారాన్ని నిలుపుకోగా, మేఘాలయాలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. 

(చదవండి: విమానం ల్యాండింగ్‌ అవుతుందనంగా.. ఎమర్జెన్సీ డోర్‌ తెరిచే యత్నం..)

మరిన్ని వార్తలు