కరోనా కట్టడిలోనూ ‘పురుషాధిక్యమే!’

1 Jan, 2021 14:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో మహిళల నాయకత్వంలోని దేశాలే ముందున్నాయని, పురుషుల నాయకత్వంలోని దేశాలు వెనకబడి పోయాయంటూ గతంలో వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని, అది మీడియా సష్టించిన వార్త మాత్రమేనని అమెరికా, బ్రిటన్‌కు చెందిన నిపుణులు అభిప్రాయపడ్డారు.

కరోనా కట్టడి చేయడంలో న్యూజిలాండ్‌ ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్, జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ చూపిన చొరవను రెట్టింను చేసి చూపిన మీడియా, వియత్నాం అధ్యక్షుడు ఫూ త్రాంగ్‌ తీసుకున్న చర్యలను పూర్తిగా విస్మరించిందని వారన్నారు. వియత్నాంలో అప్పటికి కరోనా మతులు 40 కన్నా తక్కువ ఉన్న విషయాన్ని కూడా మీడియా పరిగణలోకి తీసుకోలేదని వారు చెప్పారు. 

వాస్తవానికి పురుషుల నాయకత్వంలోని దేశాలే కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఎక్కువ విజయం సాధించాయని 175 దేశాల్లో కరోనా వైరస్‌ విస్తతి, మరణాల శాతానికి సంబంధించిన డేటాను విశ్లేషించడం ద్వారా తాము ఈ అభిప్రాయానికి వచ్చామని తెలిపారు. 175 దేశాల్లో 159 దేశాలు పురుషుల నాయకత్వంలో ఉండగా, కేవలం 16 దేశాలు మాత్రమే మహిళల నాయకత్వంలో ఉన్నాయి. టెన్నెస్సీలోని మెంపిస్‌ యూనివర్సిటీలో పొలిటికల్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న లీ విండ్సర్, ఆయన బందం ఈ తాజా అధ్యయనాన్ని నిర్వహించింది.

 

కరోనా కట్టడి చేయడంలో కొంత మంది మహిళల నాయకత్వంలోని దేశాల కషిని తాము విస్మరించడం లేదాని, అయితే కరోనా మరణాల సంఖ్యా శాతాన్ని పరగణలోకి తీసుకొని, నిజమైన డేటాను విశ్లేషించినట్లయితే పురుషు నాయకత్వంలోని ప్రభుత్వాలే పటిష్ట చర్యలు తీసుకున్న విశయం స్పష్టం అవుతుందని ఆయన బందం పేర్కొంది. 

మరిన్ని వార్తలు