రిజిస్ట్రార్‌ ముందే కేసుల మెన్షనింగ్‌

12 Aug, 2021 06:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అత్యవసర కేసుల మెన్షనింగ్‌ ఇకపై రిజిస్ట్రార్‌ వద్దే చేసుకోవచ్చని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తెలిపారు. బెంచ్‌ల వద్ద మెన్షనింగ్‌ స్థానంలో ఈ కొత్త పద్ధతి ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.‘సీనియర్‌ న్యాయవాదులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, జూనియర్లు అవకాశాలు  కోల్పోవాలని మేం కోరుకోం. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థ రూపొందించాం. బెంచ్‌ల ముందు ప్రస్తావించే అంశాలన్నీ ఇక ముందు రిజిస్ట్రార్‌ వద్దే ప్రస్తావించొచ్చు’ అని జస్టిస్‌ రమణ తెలిపారు. బెంచ్‌ల ముందు మెన్షనింగ్‌ పద్ధతి స్థానంలో సంబంధిత అధికారి ముందు మెన్షన్‌ చేసుకొనే పద్ధతి తీసుకొస్తున్నట్లు సీజేఐ జస్టిస్‌ రమణ తెలిపారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి కామన్‌కాజ్‌ స్వచ్ఛంద సంస్థ దాఖలుచేసిన కేసు విచారణ సందర్భంగా బుధవారం సీజేఐ మాట్లాడారు.

మరిన్ని వార్తలు