మెస్సీ లేరా.. సోషల్ మీడియాలో కాంతారా మీమ్ వైరల్..

20 Dec, 2022 10:41 IST|Sakshi

నరాలు తెగిపోతాయా అన్నంత టెన్షన్‌.. ఫ్రాన్స్‌ ఒక వైపు.. అర్జెంటీనాకు మద్దతుగా మిగతా ప్రపంచమంతా ఓవైపు అన్నట్లుగా జరిగిన గేమ్‌.. దానికి కారణం.. మెస్సీ... అతడి కోసమైనా అర్జెంటీనా గెలవాలి అన్నట్లుగా ఫుట్‌బాల్‌ అభిమానులు ప్రార్థనలు చేశారు.. ఊపిరి బిగపట్టి మ్యాచ్‌ను చూశారు.

జగజ్జేతగా నిలిచిన తర్వాత అటు అర్జెంటీనాలో లక్షలాదిగా జనం రోడ్డు మీదకు వచ్చి సంబరాలు చేసుకుంటే.. ఇటు సోషల్‌ మీడియాలో అభిమానులు రకరకాల ఫన్నీ మీమ్స్‌లో సందడి చేశారు. అందులో ఎక్కువ మందిని ఆకర్షించిన మీమ్‌.. ఇదిగో ఈ కాంతారా మీమ్‌.. ఇరుపక్షాల స్కోర్‌ సమమై.. మెస్సీ నీరసపడినప్పుడు అతడిలోని మహాశక్తిని నాటి మేటి దిగ్గజం మారడోనా మేల్కొలుపుతున్నట్లుగా రూపొందించిన ఈ మీమ్‌ ట్విట్టర్‌లో అందరినీ ఆకర్షిస్తోంది.

చదవండి: అర్జెంటీనా జెర్సీలో వరుడు.. ఫ్రాన్స్ జెర్సీలో వధువు..

మరిన్ని వార్తలు