మినీ బస్‌లో మంటలు.. 18 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన

6 Nov, 2022 17:55 IST|Sakshi

లఖ్‌నవూ: 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సులో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు చెలరేగటాన్ని గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దూకేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

యూపీలోని గ్రేటర్‌ నోయిడా నుంచి నోయిడాకు వస్తున్న క్రమంలో మినీ బస్సులో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సులోంచి మంటలు, నల్లటి పొగ వస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. బస్సులో మంటలు చెలరేగటంతో నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. సరస్సులో కూలిపోయిన విమానం

మరిన్ని వార్తలు