ఢిల్లీలో ఘనంగా బోనాల ఉత్సవాలు; హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

14 Jul, 2021 11:01 IST|Sakshi

ఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డి ఉత్సవాలకు హాజరై అమ్మవారికి పట్టువస్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ..  కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఢిల్లీలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. కాగా ఏడు సంవత్సరాలుగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆలయ కమిటీ నిర్వహిస్తూ వస్తుంది. బోనాలు పండుగను కేంద్ర ప్రభుత్వ ప్రముఖ పండుగల జాబితాలో చేర్చేలా కృషి చేస్తాను.  కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించాలని, కరోనాపై పోరులో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నాను అంటూ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు