రాజ్యసభ ఎంపీగా జైశంకర్‌ ప్రమాణం

22 Aug, 2023 06:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జై శంకర్‌ సహా తొమ్మిది మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం పార్లమెంట్‌ హౌజ్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.

2019లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన జైశంకర్‌ రెండోసారి గుజరాత్‌ నుంచి ఇటీవల రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు బీజేపీకి చెందిన బాబూభాయ్‌ జెసంగ్‌భాయ్‌ దేశాయ్‌ (గుజరాత్‌), కేస్రీదేవ్‌ సింగ్‌ దిగి్వజయ్‌సింగ్‌ ఝాలా (గుజరాత్‌), నాగేంద్ర రాయ్‌ (పశి్చమ బెంగాల్‌)లు, ఐదుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు డెరెక్‌ ఒబ్రియాన్, డోలా సేన్, సుఖేందు శేఖర్‌ రే, ప్రకాష్‌ చిక్‌ బరైక్, సమీరుల్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

మరిన్ని వార్తలు