విదేశాంగశాఖలో హనీట్రాప్‌ కలకలం.. సైనిక రహస్యాల కోసం పాక్‌ పన్నాగం

18 Nov, 2022 21:00 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత సైనిక సమాచారం కోసం పాకిస్థాన్‌ హనీట్రాప్‌ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. గూఢచర్యం ఆరోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూఢిల్లోని జవహర్‌లాల్‌ నెహ్రూ భవన్‌ వద్ద శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఎమ్‌ఈఏ డ్రైవర్‌ పాక్‌ హానీ ట్రాప్‌లో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పాకిస్థానీ నిఘా ఏజెన్సీకి చెందిన మహిళ డ్రైవర్‌ను ముగ్గులోకి దింపి అతనితో సన్నిహితంగా ఉంటూ సైన్యానికి సంబంధించిన కీలక సేకరించినట్లు గుర్తించారు. కొన్నిసార్లు పాకిస్థాన్‌ మహిళ పూనమ్‌ శర్మ, మరికొన్ని సార్లు పూజాగా పరిచయం చేసుకున్న ఆ దేశ గూఢచారి వలలో చిక్కుకున్న డ్రైవర్‌.. దేశ రక్షణ సమాచారం, డాక్యుమెంట్లను బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. 

ఇదిలావుండగా ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీలో 46 ఏళ్ల భాగ్‌చంద్ అనే వ్యక్తిని, రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌లో పుట్టిన ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి 1998లో ఢిల్లీకి రాగా.. 2016లో మన దేశ పౌరసత్వాన్ని పొందారు. ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అయితే పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు. పాకిస్థాన్‌లోని తన బంధువుల ద్వారా భాగ్‌చంద్ తన హ్యాండ్లర్‌లతో టచ్‌లో ఉండేవాడని తెలిపారు. 
చదవండి: షాకింగ్‌ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో!

మరిన్ని వార్తలు