2021 డిజిటల్ క్యాలెండర్ ను లాంచ్ చేసిన ప్రకాష్ జవదేకర్

8 Jan, 2021 19:28 IST|Sakshi

న్యూఢిల్లీ: నేడు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2021కి సంబందించిన డిజిటల్ క్యాలెండర్, డైరీని లాంచ్ చేసింది. ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జరిగిన లాంచ్ ఈవెంట్ లో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ బటన్ క్లిక్ ద్వారా 2021డిజిటల్ క్యాలెండర్, డైరీని లాంచ్ చేసారు. గతంలో ముద్రించిన క్యాలెండర్, డైరీలను విడుదల చేసేది కేంద్ర ప్రభుత్వం. "ప్రతి సంవత్సరం 11 లక్షల క్యాలెండర్లు, 90,000 డైరీలను ముద్రించడానికి రూ.7కోట్లు ఖర్చు అయ్యేది, ప్రస్తుతం తీసుకొచ్చిన డిజిటల్ క్యాలెండర్, డైరీ యాప్ కోసం రూ.2కోట్లు ఖర్చు అయింది"అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చీఫ్ కె.ఎస్ పేర్కొన్నారు.(చదవండి: సుశాంత్‌ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది: హైకోర్టు

2021డిజిటల్ క్యాలెండర్, డైరీ లాంచ్ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ.. గతంలో గోడలను అలంకరించిన ప్రభుత్వ క్యాలెండర్ ఇప్పుడు మొబైల్ ఫోన్‌లను అలంకరిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. 'జీఓఐ క్యాలెండర్' పేరుతో ఆండ్రాయిడ్, ఆపిల్ యాప్ స్టోర్ లలో 11 భాషలలో ఉచితంగా లభిస్తుందని పేర్కొన్నారు. "ఈ యాప్ కొత్త సంవత్సరం క్యాలెండర్ యొక్క అవసరాన్ని తొలగిస్తుంది. ప్రతి నెల కొత్త థీమ్ తో పాటు ఒక సందేశాన్ని కలిగి ఉంటుంది. డైరీ ఫీచర్ కారణంగా ఈ క్యాలెండర్ ఇతర డిజిటల్ క్యాలెండర్ యాప్ లతో పోలిస్తే ఉత్తమమైనది"అని మంత్రి పేర్కొన్నారు. ఈ యాప్ బ్యూరో ఆఫ్ ఔట్ రిచ్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ మీనిస్ట్రీచే రూపొందించబడింది. ఇది ప్రస్తుతం హిందీ మరియు ఆంగ్ల భాషలలో అందుబాటులో ఉంది. త్వరలో 11 ఇతర భారతీయ ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉండనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. 

మరిన్ని వార్తలు