హిజ్రాల హొయలు!.. ర్యాంప్‌ వ్యాక్‌ అదుర్స్‌!

23 Sep, 2022 07:20 IST|Sakshi

సాక్షి,చెన్నై: మిస్‌ హిజ్రా చెన్నై –2022 పోటీల ఆడిషన్స్‌ ఆ సంఘం ఆధ్వర్యంలో మొదలయ్యాయి. ఈ పోటీలకు అర్హులైన వారిని గురువారం చెన్నైలో ఎంపిక చేశారు. అక్టోబరు 15వ తేదీని హిజ్రాల ముప్పెరుం విళా చెన్నై వేదికగా నిర్వహించనున్నారు. 

ఈ పోటీల ఆడిషన్స్‌ కీల్పాకం డాన్‌ బాస్కో స్కూల్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగింది. 24 మంది హిజ్రాలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మోడల్స్‌కు తామేమీ తీసి పోమన్నట్లుగా ర్యాంప్‌పై హొయలొలికించారు. ఇందులో 13 మంది మిస్‌ హిజ్రా చెన్నై పోటీలకు ఎంపికయ్యారు. వీరికి పలు దశల్లో వడపోత చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 13న హిజ్రాల విద్య, ఉద్యోగంపై, 14న ఆరోగ్య సంరక్షణపై సదస్సు ఉంటుందని ఆ సంఘం నేత సుధా తెలిపారు. అలాగే ఫైనల్స్‌ చెన్నై కలైవానర్‌ అరంగం వేదికగా అక్టోబరు 15న నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు