అయ్యో త‌ల్లి.. ఆ చిరుత పులి నీపై క‌నిక‌రం చూప‌లేక‌పోయిందా

5 Jun, 2021 12:48 IST|Sakshi

చిన్నారిని నోట క‌రుచుకొని ఈడ్చుకెళ్లిన చిరుత పులి

జ‌మ్ము-కాశ్మీర్ : ఇంటి చుట్టూ ఆహ్లాద‌క‌ర వాతావార‌ణం. ఆడుకునేందుకు అనువైన ప్రాంతం. ఓ చిన్నారి ఇంటి లాన్లో ఆటలాడుకుంటూ అనంతలోకాల్లో కలిసి పోయింది. అప్ప‌టి వ‌ర‌కు ఆడుకుంటూఉన్న చిన్నారి  విగ‌త‌జీవిగా క‌నిపించ‌డంతో స్థానికుల గుండె తరుక్కుపోయింది

జ‌మ్మూ-కాశ్మీర్లోని బూద్గాం జిల్లా ఓంపోరా హౌసింగ్ కాల‌నీలో నాలుగేళ్ల చిన్నారి అధా యాసిర్ ఇంటి ప‌రిస‌రాల్లో ఆడుకుంటుంది. అయితే లాన్లో ఆడుకుంటున్న ఆధా ఒక్క‌సారిగా వెక్కి వెక్కి ఏడ్చింది. పాప ఏడుపు విన్న కుటుంబ‌స‌భ్యులు ఏమైందోన‌ని  కంగారు ప‌డ్తూ వ‌చ్చి చూడాగా పాప క‌నిపించ‌లేదు. దీంతో పాప క‌నిపించ‌డం లేదంటూ త‌ల్లిదండ్రులు ఇల్లు, కాల‌నీ ప‌రిస‌రాల్ని పరిశీలించారు. స్థానికులు మాత్రం అప్ప‌టి వ‌ర‌కు చిన్నారి ఆధా ఆడుకుంటుండ‌గా తాము గ‌మ‌నించిన‌ట్లు చెప్పారు. అయితే పాప ఆచూకీ ఎంత‌కీ తెలియ‌క‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇంటి స‌మీపంలో చెప్పులు, మెడ‌లోని హారం లభ్య‌మ‌య్యాయి. కానీ పాప ఎక్క‌డుందో తెలియ‌దు.  

కానీ గాలింపు చ‌ర్య‌ల్లో మ‌రుస‌టి రోజు ఇంటి నుంచి  కిలోమీట‌ర్ దూరంలో ఉన్న అట‌వీ ప్రాంతంలో చిన్నారి మృత‌దేహం ల‌భ్య‌మైన‌ట్లు అట‌వీ శాఖ అధికారులు తెలిపారు. పాప‌ను చిరుత పులి చంపి ఉంటుంద‌ని జిల్లా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్  తాహిర్ సలీమ్ తెలిపారు. చిన్నారి మ‌ర‌ణంపై  స్థానికులు, ప‌లువురు రాజ‌కీయ నేత‌లు అటవీ శాఖ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది అట‌వీ ప్రాంతం. వన్య‌ప్రాణాలు తిరుగుతుంటాయి. అధికారులు మాత్రం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. చైన్ ఫెన్సింగ్ నిర్మాణంపై క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకొని ఉండి ఉంటే పాప ప్రాణాలు దక్కేవని మండిప‌డుతున్నారు.  


చ‌ద‌వండి : నేను రాజుని.. ఇంటి బ‌య‌ట‌కు పిలిచి ఆగి ఉన్న కార్ల మ‌ధ్యలో దారుణం
 

>
మరిన్ని వార్తలు