తొమ్మిదేళ్ల వయసులో తప్పిపోయిన బాలిక.. 13 ఏళ్ల తర్వాత..

5 Jan, 2022 21:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యశవంతపుర: తొమ్మిదేళ్ల వయసులో తప్పిపోయిన ఓ బాలిక 22 ఏళ్లు వచ్చిన తరువాత తిరిగి అమ్మ చెంతకు చేరిన ఘటన  చిక్కమగళూరు జిల్లా మూడగెరెలో జరిగింది. మూడగెరెకు చెందిన అంజలి చిన్నప్పుడు తప్పిపోయింది. పలుచోట్ల తల్లిదండ్రులు గాలించినా ఫలితం కనిపించలేదు. కుమార్తెపై ఆశ వదులుకున్నారు. ఇదిలా ఉంటే అంజలి కేరళలోని ఓ ప్రాంతంలో పాచిపనులు చేస్తూ జీవిస్తోంది. దాదాపు 13 ఏళ్ల తరువాత పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. తన ఊరును వెతుక్కుంటూ చివరకు తల్లి చెంతకు చేరింది.  తల్లిదండ్రులు కుమార్తెను హత్తుకుని ఆనందభరితులయ్యారు. 

మరో ఘటనలో..
మలబార్‌ కొత్త స్టోర్లు  
సాక్షి, బెంగళూరు: ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ కొత్త ఏడాదిలో దేశీయంగా, ప్రపంచ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలను విస్తరించనున్నట్లు  గ్రూప్‌ అధ్యక్షుడు ఎంపీ అహ్మద్‌ మంగళవారం తెలిపారు. జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా 22 కొత్త స్టోర్లను తెరవనున్నట్లు చెప్పారు. మొదటి స్టోర్‌ను బెంగళూరు ఎంజీ రోడ్డులో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. తద్వారా 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

మరిన్ని వార్తలు