లక్కీఛాన్స్‌ అంటే ఇదే: ఎగిరిపోయిన చిలుకను తెచ్చాడు.. జాక్‌పాట్‌ కొట్టాడు

23 Jul, 2022 13:13 IST|Sakshi

వైరల్‌: రుస్తం.. పర్షియన్‌ పురాణాల్లో ఓ వీరుడి పేరు. అలాంటి పేరును ఇక్కడో వ్యక్తి తాను ప్రేమగా పెంచుకున్న చిలుకకు ఆ పేరు పెట్టుకున్నాడు. కానీ.. అది కనిపించకుండా పోయేసరికి అల్లలాడిపోయాడు. ఆచూకీ చెప్పినా.. తెచ్చి ఇచ్చినా మంచి పారితోషకం ఇస్తానని  ప్రకటించాడు. 

అంతేకాదు పోస్టర్లతో పాటు నగరం అంతటా ప్రకటన ఇచ్చాడు. కనిపించకుండా పోయిన తను రుస్తంను పట్టి తెచ్చిస్తే యాభై వేల రూపాయల క్యాష్‌ ప్రైజ్‌ ప్రకటించాడు కూడా. ఆ ప్రకటన చూసి శ్రీనివాస్‌ అనే ఓ స్థానికుడు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఫలితంగా.. రుస్తం దొరక్కగా.. ఓ ఓనర్‌ మరో 35 వేల రూపాయలను అదనంగానే ఇచ్చాడు. 

కర్ణాటక తుమ్మకూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్జున్‌ అనే వ్యక్తి ఓ ఆఫ్రికన్‌ చిలుకను రెండున్నరేళ్లుగా పెంచుకుంటున్నాడు. దానికి రుస్తం అని పేరు పెట్టారు. అది ఆ కుటుంబంతో మమేకం అయిపోయింది. అయితే జులై 16వ తేదీ ఇంట్లోంచి ఎగిరిపోయి.. అది మళ్లీ తిరిగి రాలేదు. దీంతో అర్జున్‌ ఒక ప్రకటన ఇచ్చాడు. 

అయితే ఆ ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో చెట్లలో గాయపడి.. ఆకలితో, భయంతో ఉన్న తన రుస్తంను శ్రీనివాస్‌ చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చారని, అందుకే అదనంగా పారితోషకం ఇచ్చానని అర్జున్‌ చెప్తున్నాడు. ఇన్‌స్టంట్‌ అదృష్టం కూడా ఊరికే రాదు.. అందుకూ ఏదో ఒక ప్రయత్నం చేయాల్సిందే అని అంటున్నారు ఈ ఘటన చూసిన కొందరు.

మరిన్ని వార్తలు