14 ఏళ్లకే ఇంట్లో నుంచి పరార్‌.. 2 ఏ‍ళ్ల తర్వాత 4 నెలల శిశువుతో!

21 Jun, 2021 16:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై/తిరువనంతపురం: కేరళలో కనిపించకుండా పోయిన ఓ మైనర్‌ బాలికను రెండేళ్ల తరువాత తమిళనాడులోని మదురైలో పోలీసులు గుర్తించారు. తప్పిపోయిన సమయంలో బాలిక వయస్సు 14 ఏళ్లు కాగా ప్రస్తుతం ఆమెకు 16 ఏళ్లు. అయితే ఇప్పుడు నాలుగు నెలల శిశువుకు తల్లి. ఆమె తమిళనాడు 22 ఏళ్ల వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌ జిల్లాలోని(తమిళనాడుకు సరిహద్దు ప్రాంతం)కోజింజపారాకు చెందిన 14 ఏళ్ల బాలిక రెండేళ్ల క్రితం తప్పిపోయింది. ఓ వ్యక్తితో కలిసి 2019లో ఇంట్లోనుంచి పారిపోయినట్లు తెలిసింది. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించగా.. కోజింజంపారా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. 

ఇక తాజాగా రెండేళ్ల తరువాత జూన్‌ 18న వీరిద్దరూ మదురైలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆమె తన తల్లితో కలిసి క్యాటరింగ్‌ పనిచేసే వ్యక్తితో మదురైలోని ఇంట్లో కనిపించింది. కాగా ఆ వ్యక్తికి చెందిన దూరపు బంధువులు అతని ఇంటి సమీపంలో నివసిస్తున్నారని, బాలికను అతని భార్యగా వారు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. అయితే బాలిక వయసు గురించి ఖచ్చితంగా తెలియదన్నారు. ప్రస్తుతం ఆమె ఇప్పుడు నాలుగు నెలల శిశువుకు తల్లి అని పాలక్కాడ్‌ జిల్లా డీఎస్పీ జాన్‌ సీ తెలిపారు.

వీర్దిరూ కలిసి జీవిస్తున్నారన్న ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసి ఉందో లేదో తమకు తెలియదని పోలీసులు అన్నారు. బాలికను, శిశువును తిరిగి కేరళకు పంపించామని, సదరు వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం సెక్షన్ల కింద వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు, ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం శిశువు, బాలిక డీఎన్‌ఏ నమూనాలను సేకరిస్తామని వెల్లడించారు.

చదవండి: దారుణం: దెయ్యం పట్టిందని కొడుకును కొట్టి చంపిన తల్లి

మరిన్ని వార్తలు