MK Stalin Talking With Women Labour: మహిళా రైతులను ఆశ్చర్యపరిచిన సీఎం.. పొలంలోకి దిగి

2 Oct, 2021 18:04 IST|Sakshi

మధురై: ఆ మహిళలంతా పొలంలో పని చేసుకుంటూ బిజీగా ఉన్నారు. తమ సాధకబాధకాలు ముచ్చటిస్తూ.. పొలంలో నాట్లు వేస్తున్నారు. ఇంతలో వారి వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. మొదట ఆ వ్యక్తిని చూసిన మహిళలు ఒక్కసారి షాక్‌ అయ్యారు. ఇంత పెద్ద వ్యక్తి మా దగ్గరకు రావడం ఏంటని ఆశ్చర్యపోయారు. ఇంతకు ఆ మహిళలను అంతలా ఆశ్చర్యపరిచిన సదరు ప్రముఖుడు ఎవరంటే.. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌. పొలంలో పని చేసుకుంటున్న మహిళల వద్దకు వెళ్లి పలకరించారు సీఎం ఎంకే స్టాలిన్‌. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
(చదవండి: నో లగ్జరీ ఫుడ్‌: ఆసక్తి రేపుతున్న సీఎం స్టాలిన్‌ నిర్ణయాలు!)

మధురై జిల్లా, నట్టపటి గ్రామంలో శనివారం కొందరు మహిళలు పొలంలో నాట్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆ మార్గంలో వెళ్తున్న స్టాలిన్‌... తన వాహానం ఆపి.. పొలంలోకి వెళ్లి మహిళా రైతులతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏకంగా ముఖ్యమంత్రే తమ వద్దకు రావడంతో సదరు మహిళా రైతుల ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారి సమస్యలను ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మీడియాలో వైరలవుతోంది. 

చదవండి: ట్రాన్స్‌జెండర్‌ చిరకాల కల నెరవేర్చిన సీఎం స్టాలిన్‌

>
మరిన్ని వార్తలు