గాయని‌పై అత్యాచారం.. ఎమ్మెల్యేపై కేసు నమోదు

19 Oct, 2020 08:14 IST|Sakshi

లక్నో: ఓ ఎమ్మెల్యే, అతడి కుమారుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఉత్తరప్రదేశ్‌ గాయని‌ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్యెల్యేతో సహా మరో ఇద్దరి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ మిత్రపక్షమైన నిషద్‌ పార్టీ (నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్) ఎమ్మెల్యే విజయ్‌ మిశ్రా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. వివరాలు.. 2014లో విజయ్‌ మిశ్రా ఓ కార్యక్రమం కోసం 25 ఏళ్ల బాధిత గాయ‌నిరి తన ఇంటికి పిలిచారు. ఈ క్రమంలో విజయ్‌ మిశ్రా, అతడి కుమారుడు ఆమెపై అత్యాచారం చేశారు. దీని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఎమ్మెల్యే తనను బెదిరించారని బాధితురాలు ఆరోపించారు. అలానే 2015లో వారణాసిలో ఒక హోటల్‌లో ఎమ్మెల్యే మరో సారి బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు బధోహి ఎస్పీ రామ్‌ బదన్‌ సింగ్‌ తెలిపారు. అనంతరం మిశ్రా ఆమెను ఇంటి దగ్గర వదిలేయమని కొడుకు, మేనల్లుడికి చెప్పారని.. అయితే వారు కూడా ఆమెపై అత్యాచారం చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపిందన్నారు ఎస్పీ. (చదవండి: ‘అవి రక్తపు మరకలు కాదు పెయింట్‌’)

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌ మిశ్రాపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. తాజాగా గత ఏడాది సెప్టెంబర్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన భూమిని ఆక్రమించుకున్నారన్న కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ విషయం తెలియడంతో గాయని... ఆయనపై గోపిగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘విజయ్‌ మిశ్రా వద్ద నా వీడియో క్లిప్‌ ఉంది. ఆయన మీద అనేక కేసులు ఉన్నప్పటికి ఎమ్మెల్యే కావడంతో ఫిర్యాదు చేయడానికి నేను భయపడ్డాను అని తెలిపారు. ఇక మిశ్రాను మూడు వారాల క్రితం చిత్రకూట్‌ జైలు నుంచి ఆగ్రా సెంట్రల్‌ జైలు తరలించినట్లు అధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు