వ్యవసాయ కూలీలతో భోజనం చేసిన ఎమ్మెల్యే రేఖానాయక్‌

30 Jul, 2022 21:10 IST|Sakshi
కూలీలతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే రేఖానాయక్‌ 

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రజా జీవితంలో, పార్టీ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉండే ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ శుక్రవారం పంట పొలాల్లో కనిపించారు. ఇంద్రవెల్లి మండలంలోని దనోర బి గ్రామానికి వెళ్తున్న సమయంలో పంట చేలల్లో పనిచేస్తున్న వారిని చూసి వారి వద్దకు వెళ్లారు. కూలీలతో కలిసి భోజనం చేశారు. తాను చిన్నప్పుడు అమ్మమ్మతో కలిసి చేనులోకి వెళ్లి సరదగా పని చేసిన పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు.

ఈ సందర్భంగా అక్కడ పని చేస్తున్న మహిళలు ఎమ్మెల్యేతో పలు సమస్యలను విన్నవించారు. తాము ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారమని, పేదరికంలో ఉన్నామని చెప్పడంతో.. స్పందించిన ఎమ్మెల్యే రెండో దశ దళితబంధులో మీకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఎంపీపీ పోటే శోభాబాయి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మారుతి డోంగ్రె, సర్పంచ్‌ కోరెంగా గాంధారి, ఎంపీటీసీ సభ్యులు జాదవ్‌ స్వర్ణలత, గిత్తే ఆశాబాయి ఉన్నారు.
చదవండి: ‘చీకోటి’ వెనుక ఉన్న చీకటి మిత్రులెవరూ?

మరిన్ని వార్తలు