బీజేపీ ఎమ్మెల్యేకు షాక్‌.. వాట్సాప్‌లో యువతి న్యూడ్‌ వీడియో కాల్‌చేసి.. 

3 Nov, 2022 17:57 IST|Sakshi

ఇటీవలి కాలంలో హనీట్రాప్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాజకీయనేతలు, ప్రముఖులే టార్గెట్‌గా అందమైన యువతులు హనీట్రాప్‌నకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యేకు భారీ షాక్‌ తగిలింది. ఓ యువతి వాట్సాప్‌ కాల్‌ చేసి న్యూడ్‌గా మాట్లాడటంతో ఖంగుతిన్న ఎమ్మెల్యే వెంటనే కాల్‌ కట్‌ చేశాడు. 

వివరాల ప్రకారం.. కర్నాటకలోని చిత్రదుర్గ ఎమ్మెల్యే జి.హెచ్‌. తిప్పారెడ్డికి చేదుఅనుభవం ఎదురైంది. ఓ అపరిచిత యువతి తిప్పారెడ్డికి వాట్సాప్‌ కాల్‌ చేసి హనీట్రాప్‌ చేసేందుకు ప్రయత్నించింది. సదరు యువతి తనకు అక్టోబర్‌ 31వ తేదీన తనకు వీడియో కాల్‌ చేసిందన్నారు. అయితే, నియోజకవర్గానికి చెందిన వ్యక్తులెవరైనా తనకు కాల్‌ చేస్తున్నారని భావించిన ఆయన.. కాల్‌ లిఫ్ట్‌ చేయడంతో యువతి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందన్నారు. ఈ క్రమంలో తన దుస్తులు విప్పేసి న్యూడ్‌గా మాట్లాడే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. తాను వెంటనే కాల్‌ కట్‌ చేసినట్టు చెప్పుకొచ్చారు. 

కాగా, మరికొద్ది క్షణాలు తర్వాత.. ఆమె మళ్లీ కాల్‌ చేసిందన్నారు. దీంతో, తన భార్యను కాల్‌ లిఫ్ట్‌ చేయమని చెప్పాను. అనంతరం, తన భార్య.. ఆ నంబర్‌ను బ్లాస్‌ చేసినట్టు చెప్పుకొచ్చారు. అనంతరం, ఈ విషయంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు