కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం.. కేబినెట్‌లో సౌరవ్‌, అతిషిలకు చోటు

1 Mar, 2023 13:12 IST|Sakshi

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో కేజ్రీవాల్‌ ఇద్దరి చోటు కల్పించారు. సౌరవ్‌ భరద్వాజ్‌, అతిషికి సీఎం కేజ్రీవాల్‌ చోటు కల్పించారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనాకు లేఖ రాశారు. కాగా, 48 గంటల్లో వారితో ప్రమాణ స్వీకారం చేపించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మంత్రులు మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. సీబీఐ వారిని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టింది. దీంతో​ వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌.. కేబినెట్‌లో సౌరవ్‌, అతిషికి చోటు కల్పించారు. ఇదిలా ఉండగా.. మనీశ్‌ సిసోడియా ఢిల్లీ ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యశాఖతో సహా అనేక ఉన్నత స్థాయి శాఖలను కలిగి ఉన్నారు. సత్యేంద్ర జైన్ ఢిల్లీ ఆరోగ్య, జైళ్ల శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే, సిసోడియాకు చెందిన ఫైనాన్స్, విద్యతో సహా కొన్ని పోర్ట్‌ఫోలియోలు కైలాష్ గహ్లోట్, రాజ్ కుమార్ ఆనంద్‌లకు కేటాయించారు.

మరిన్ని వార్తలు