ఇండియా గేట్‌ వద్ద బతుకమ్మ వేడుకలు.. బీజేపీకి బుద్దివచ్చిందంటూ కవిత కౌంటర్‌

27 Sep, 2022 19:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా, తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కర్తవ్యపథ్‌లో తొలిసారి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువరు ప్రముఖులు పాల్గొన్నారు. 

అయితే, ఈ వేడుకలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చాక ఎనిమిదేళ్లకు బీజేపీకి బుద్ది వచ్చింది. కేసీఆర్‌ దెబ్బకు గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వద్ద బతుకమ్మ ఆడుతున్నారు. తెలంగాణలో సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ పేరుతో విమోచనం అంటున్నారు. అదే గుజరాత్‌లో పటేల్‌ విగ్రహం పెట్టి స్టాచ్యూ ఆఫ్‌ ఇక్వాలిటీ అంటున్నారు. విభజన కావాలా.. యూనిటీ కావాలా తేల్చుకోవాలి. 

ఈరోజు ఢిల్లీలో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయంటే దాని వెనుక సీఎం కేసీఆర్‌ ఉన్నారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ ఒక ప్రతీక. జాతీయ రాజకీయాలవైపు కేసీఆర్‌ చూస్తున్నారు కాబట్టే బీజేపీ నేతలు ఉలిక్కిపడ్డారు. అందులో భాగంగానే నేడు ఢిల్లీలో బీజేపీ నేతలు.. బతుకమ్మ వేడుకలు జరుపుతున్నారు’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు