కవితను ఇబ్బంది పెడుతున్నారు..ఈడీ రాత్రి వేళ ప్రశ్నించడమేంటి?: సోమా భరత్

16 Mar, 2023 13:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరుకారని ఆమె తరఫు న్యాయవాది సోమా భరత్ తెలిపారు. కవిత రాసిన లేఖను ఈడీ కార్యాలయానికి వెళ్లి అందించారు. మహిళలను ఇంటి వద్ద మాత్రమే ప్రశ్నించాలని, ఈనెల 11న రాత్రి 8 గంటల వరకు కవితను ఈడీ అధికారులు విచారించారని గుర్తు చేశారు. సీఆర్‌పీసీ 160 కింద మహిళలకు ఉన్న హక్కులను మాత్రమే అడుగుతున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామన్నారు.

ఇది రాజకీయ దురుద్దేశంతో సృష్టించిన కేసు అని, కవితను కేంద్రం ఇబ్బంది పెడుతోందని సోమా భరత్ అన్నారు. ఈడీ ఇప్పటివరకు మళ్లీ నోటీసులు ఇవ్వలేదు, తేదీ కూడా చెప్పలేదని పేర్కొన్నారు. కవిత పంపిన లేఖను ఈడీకి అందించానని, వారు దానికి రిప్లై ఇవ్వాల్సి ఉందని చెప్పారు.
చదవండి: విచారణకు రాలేనన్న కవిత.. కుదరదన్న ఈడీ

మరిన్ని వార్తలు