వైరల్‌: ఆగ్రహంతో ‘టార్చ్‌లైట్‌’ విసిరిన కమల్‌ హాసన్‌‌

31 Mar, 2021 16:40 IST|Sakshi

చెన్నె: రాజకీయాలు అంటే ఆషామాషీ కాదు. ఎంతో ఓపిక.. సహనం ఎంతో ఉండాలి. క్షణికావేశాలకు గురయితే పతనమే. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌ హాసన్‌ అసహనానికి గురయ్యారు. ఎప్పుడూ లేనిది కోపం ప్రదర్శించారు. ఈ సందర్భంగా తన పార్టీ గుర్తుగా ఉన్న ‘టార్చ్‌లైట్‌’ను విసిరేశారు. కాన్వాయ్‌లో ఉండగా ఏదో విషయమై అసంతృప్తికి గురయి టార్చ్‌లైట్‌ విసిరివేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

దక్షిణ కోయంబత్తూరు నుంచి అసెంబ్లీకి కమల్‌ హాసన్‌ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్‌ హాసన్‌ ఆ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. కాన్వాయ్‌లో వెళ్తూ అభివాదం చేస్తున్నాడు. ఈ క్రమంలో మాట్లాడుతుండగా కమల్‌ మైక్రోఫోన్‌ పని చేయలేదు. ప్రజలకు ఆయన మాటలు వినకపోవడం గమనించి వాహనంలో ఉన్న వారిని అడిగారు. ‘ఏమైంది?’ అని.. ఎంతకీ మైక్రోఫోన్‌ సరిగా పని చేయకపోవడంతో కమల్‌ హాసన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే ఎడమ చేతిలో ఉన్న తన పార్టీ గుర్తు ‘టార్చ్‌లైట్‌’ను వాహసంలోపలికి విసిరేశారు. వాహనంలో ఉన్న వ్యక్తిపై పడేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ట్రోల్‌ చేస్తూ కమల్‌ అంత కోపం వద్దు.. అంటూ హితవు పలుకుతున్నారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు