డ్రింక్‌ చేసి.. సీన్‌ క్రియేట్‌ చేసిన మోడల్‌

10 Sep, 2021 16:29 IST|Sakshi

భోపాల్‌:  తాగి నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం వల్ల ఎన్నో నిండు ప్రాణాలు బలైపోతున్న ఘటనలను ఈ మధ్య మనం తరుచు చూస్తున్నాం . వాటిని కట్టడి చేసేందుకు పోలీస్‌ యంత్రాంగం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న అవి సఫలం కావటం లేదు. అంతేకాదు మరికొంత మంది డ్రింక్‌ చేసి రోడ్ల పైకి వచ్చి హల్‌చల్‌ చేసి పెద్ద హంగామా సృష్టిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడి....ట్రాఫ్రిక్‌ పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారవుతోంది. తాజాగా అలాంటి సంఘటనే గాల్వియార్‌లో చోటు చేసుకుంది. (చదవండిబాలకార్మికుడి స్థాయి నుంచి గురువుగా!)

మధ్యప్రదేశ్‌లోని గాల్వియార్‌లో ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల ఒక మోడల్‌ రద్దీ రహదారి పైకీ వచ్చి ఆర్మీ వాహనాన్ని అడ్డుకుని ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. దీంతో ఆ కారు డ్రైవర్‌ జోక్యం చేసుకుని ఆమెని వారించటానికీ ప్రయత్నిస్తుంటే ..ఆమె అతన్ని పక్కకు నెట్టేసి వాదనకు దిగింది. ఈ క్రమంలో పోలీసులు వచ్చి ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తర్వాత ఆమె బెయిల్‌ మీద బయటకు వచ్చింది. ఆ ఆర్మీ అధికారి ఆమె పై ఎలాంటి కంప్లయింట్‌ ఇవ్వలేదని పోలీసు అధికారి చెప్పారు. సదరు మోడల్‌ గాల్వియార్‌లో పర్యటించటానికి వచ్చినట్టుగా పేర్కొన్నారు.(చదవండిడాక్టరేట్‌ గ్రహీత.. మాజీ అథ్లెట్‌.. మాజీ టీచర్‌కు దయనీయ పరిస్థితి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు