గ‌త 500 సంవ‌త్స‌రాల్లో ఆ ఘ‌న‌త మాత్రం మోదీకే

5 Aug, 2020 12:15 IST|Sakshi

భోపాల్ :  అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి ప్ర‌ధాని మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన వెబినార్‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోన‌య్యారు. 1990లో పార్టీ నాయకుడు ఎల్‌కె అద్వానీ రథయాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాల‌ను  పంచుకున్నారు. ల‌క్ష‌లాదిమంది రామ భ‌క్తుల 500 ఏళ్ల‌నాటి సుదీర్ఘ పోరాటం సాకార‌మ‌య్యింద‌న్నారు. 1990లో ఎల్ కె అద్వానీ నాయకత్వంలో రథయాత్ర జరిగినప్పుడు తాను ఎమ్మెల్యేన‌ని, కర‌సేవ కోసం అయోధ్యకు త‌ర‌లివెళ్లామన్నారు. త‌మ‌ను అరెస్ట్ చేసి జౌన్‌పూర్ జైలులో ఉంచార‌ని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేయడం చరిత్రాత్మకమని అన్నారు. మ‌త సామ‌ర‌స్యం కోసం ప్ర‌ధాని చూపిన సంక‌ల్ప బ‌లం ఈరోజు సాక్షాత్క‌ర‌మ‌వుతుంద‌న్నారు. గ‌త 500 సంత్స‌రాల‌లో భార‌త‌దేశ‌పు అత్యంత శ‌క్తిమంత‌మైన ప్ర‌ధానిగా మోదీ నిలిచార‌ని సీఎం శివ‌రాజ్ సింగ్ కొనియాడారు. (28 ఏళ్ల ఉపవాసం ముగించనున్న ‘కలియుగ ఊర్మిళ’)


ఇక క‌రోనానుంచి కోలుకున్న సీఎం శివ‌రాజ్ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గ‌త‌నెల 25న సీఎంకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో స్థానిక చిరాయు ఆసుపత్రిలో చికిత్స అనంత‌రం ఆయ‌న కోలుకున్నారు. మ‌రో 7 రోజ‌లు పాటు ఇంట్లోనే క్వారంటైర్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించిన‌ట్లు శివ‌రాజ్ సింగ్ తెలిపారు. (మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత)


 

మరిన్ని వార్తలు