సింగిల్‌ బ్రాండ్‌ భారత్‌తో అన్ని సబ్సిడి ఎరువులు: మోదీ కొత్త స్కీం

17 Oct, 2022 14:47 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం ప్రధాన మంత్రి భారతీయ జన్‌ ఉర్వరక్‌ పరియోజన కింద 'వన్‌ నేషన్‌ వన్‌ ఫెర్టిలైజర్‌' అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది.  ఈ పథకం కింద అన్ని సబ్సిడీ ఎరువులను ఒకే బ్రాండ్‌ కింద మార్కెట్‌ చేయడం తప్పనసరి చేశారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్‌ సమ్మేళన్‌ 2022 సందర్భంగా జరుగుతున్న రెండు రోజుల కార్యక్రమంలో సింగిల్‌ బ్రాండ్‌ భారత్‌ పేరుతో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు.

సబ్సడి ఎరువుల అక్రమ మార్గంలో తరలింపుకు చెక్‌పెట్టేలా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం కింద యూరియా, డి అమ్మెనియా ఫాస్ఫేట్‌(డీఏపీ), మ్యూరియేట్‌ ఆఫ్‌ పొటాష్‌(ఎంఓపీ), ఎన్‌పీకే వంటివి ఒకే బ్రాంక్‌ కింద విక్రయాలు జరుగుతాయి. అంతేగాక సుమారు 600 పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాలను(పీఎంకేఎస్‌కే) కూడా ప్రారంభించారు. ఇవి రైతులకు వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు అందిచడమే కాకుండా బహుళ సేవలను అందించే ఒక షాపుగా పనిచేస్తుంది.

దేశంలో దాదాపు 3.5 లక్షలకు పైగా ఉన్న రిటైల్‌ దుకాణాలను పీఎంకేఎస్‌కేగా మార్చాలని కేంద్రం భావిస్తోంది.  ఈ కేంద్రల్లో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు వంటివి అందించడమే కాకుండా, మట్టి, విత్తనాలు, ఎరువులకు సంబంధించిన పరీక్ష సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తుంది.

మోదీ ఈ రెండు రోజుల కిసాన్‌ సమ్మేళన్‌ కార్యక్రమంలో "ఇండియన్‌ ఎడ్జ్‌" అనే ఈ మ్యాగజైన్‌ కూడా ప్రారంభించారు. దీనిలో దేశీయ, అంతర్జాతీయ ఎరువుల సమాచారం, ఇటీవల ఉన్న ధరలు, అభివృద్ధి, వినియోగాలు తదితర అంశాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా తదితరులు పాల్గొన్నారు.

(చదవండి: ఆ రైతు పక్కా ప్రణాళిక.. రోజూ ఆదాయం, లాభాలే లాభాలు!)

మరిన్ని వార్తలు